జానీ మాస్టర్ పై డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ వేటు ...
on Dec 9, 2024
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఐతే దేనికి అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసిందే. అసోసియేషన్ నుంచి తొలగించినట్లు జానీ మాస్టర్‌పై ఒక ప్రచారం జరుగుతోంది. ఐతే తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ అంటున్నారు.
శంకర్ పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని ఆ విషయంలో కోట్ల రూపాయలు స్కామ్ చేశారని అంటున్నారు అలాగే డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డానంటూ చేస్తున్న ప్రచారం పైన కూడా తానూ ప్రశ్నిస్తున్నందుకు తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంలో ఫైట్ చేస్తానని చెప్తున్నారు జానీ మాస్టర్. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై రీసెంట్ గానే విడుదల అయ్యారు. ఐతే ఇప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ఎన్నికయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఈ పదవి కేవలం 11 నెలలు మాత్రమే వుంటుంది..
Also Read